రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:40 AM
ఉరవకొండ - ఇంద్రావతి రోడ్డు వర్షానికి గుంతలు పడి అధ్వానంగా తయారైంది. విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు
ఉరవకొండ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఉరవకొండ - ఇంద్రావతి రోడ్డు వర్షానికి గుంతలు పడి అధ్వానంగా తయారైంది. విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి హంద్రీనీవా కాలువ నిర్మాణం కాంట్రాక్టర్లతో మాట్లాడి.. తాత్కాలికంగా రోడ్డుపై మట్టి తోలించి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారు. దీంతో ఆదివారం ఎక్స్‌కవేటర్ సాయంతో మట్టి తోలి.. రోడ్డును బాగు చేశారు.