Share News

ఆలయ పునఃనిర్మాణానికి శ్రీకారం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:18 AM

మండలంలోని బొప్పేపల్లి కోన ఓబులేసుస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆయన పునఃనిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు.

ఆలయ పునఃనిర్మాణానికి శ్రీకారం
శాంతిహోమం నిర్వహిస్తున్న పండితులు

యల్లనూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొప్పేపల్లి కోన ఓబులేసుస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆయన పునఃనిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ పనులను రూ. 1.70 కోట్లతో చేపడుతున్నట్లు ఆ కమిటీ అధ్యక్షుడు అచ్యుతాపురం రామచంద్రారెడ్డి తెలిపారు. పండితులు స్వామివారి విగ్రహాన్ని ఆలయం నుంచి తీసి కోనేరులో ఉంచారు. అనంతరం శాంతిహోమం నిర్వహించారు. చెక్కతో చేసిన నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Nov 28 , 2025 | 12:18 AM