వెలుగు జ్యోతులు అధ్యాపకులు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:22 AM
అధ్యాపకులు దేశానికి వెలుగు చూపే జ్యోతులని, విద్యార్థులను బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్డడంలో వీరే కీలక పాత్ర పోషిస్తున్నారని జేఎనటీయూఏ వీసీ సుదర్శనరావు అన్నారు. వర్సిటీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జేఎనటీయూఏ వీసీ సుదర్శనరావు
అనంతపురంరూరల్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): అధ్యాపకులు దేశానికి వెలుగు చూపే జ్యోతులని, విద్యార్థులను బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్డడంలో వీరే కీలక పాత్ర పోషిస్తున్నారని జేఎనటీయూఏ వీసీ సుదర్శనరావు అన్నారు. వర్సిటీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో సర్వేపల్లి చిత్రపటానికి వీసీ సుదర్శనరావు, రిజిసా్ట్రర్ కృష్ణయ్య, ఓఎ్‌సడీ దేవన్న తదితరులు నివాళులు అర్పించారు. వీసీ మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిత్వం వికసించడానికి, విద్యాపరమైన విజయాలకు క్రమశిక్షణయుతమైన బోధన కీలకమైందన్నారు. ఈక్రమశిక్షణ బోధించి విద్యార్థులను తీర్చి దిద్దడంలో టీచర్ల పాత్ర అమోఘమైందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సత్యనారాయణ, భానుమూర్తి, వైశాలిఘెర్పడే, నాగప్రసాద్‌నాయుడు, కిరణ్మయి, సురే్‌షబాబు, దుర్గాప్రసాద్, శోభిబిందు, సుజాత, శివకుమార్, ఏటిపిఆర్‌ఐ డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వసుంధర పాల్గొన్నారు. ఓటీపీఆర్‌ఐలో కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సంస్థ సంచాలకులు జీవీ సుబ్బారెడ్డి తదితరులు సర్వేపల్లి రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోపినాథ్, డిప్యూటి రిజిసా్ట్రర్ దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.