విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించండి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:18 AM
మండలంలోని ఉదిరిపికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ ప్రసాద్‌బాబు గురువారం సాయంత్రం తనిఖీ చేశారు
కూడేరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉదిరిపికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ ప్రసాద్‌బాబు గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నట్లు గుర్తించిన ఆయన ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పర్యవేక్షించాలని ప్రధానోపాధ్యాయురాలు హరిశ్రీ పై మండిపడ్డారు. టెన్తలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట ఏడీ మునీర్‌ఖాన ఉన్నారు.