Share News

victory ఘనంగా టీడీపీ విజయోత్సవ ర్యాలీ

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:06 AM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని బుధవారం ఘనంగా నిర్వహించారు.

 victory   ఘనంగా టీడీపీ విజయోత్సవ ర్యాలీ
ర్యాలీలో ఎమ్మెల్యే అశ్మితరెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, జూన 4(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జేసీ నివాసానికి చేరుకొని అక్కడి నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గన్నెవారిపల్లికాలనీ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంతరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల రోడ్డులో నుంచి భారీగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్‌ నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, మోటాటి పవనకుమార్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, జగన్నాథరెడ్డి, కౌన్సిలర్లు విజయ్‌కుమార్‌, మల్లికార్జున, షెక్షావలి పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:06 AM