TDP కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
ABN , Publish Date - May 20 , 2025 | 11:58 PM
పార్టీ కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.
కదిరి, మే 20(ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పీవీఆర్ గ్రాండ్‌లో టీడీపీ మినీ మహానాడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ మహిళ కార్యకర్తలను నడిరోడ్డులో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మద్యం కుంభకోణంలో పూర్తిస్థాయిలో మునిగిపోయిందని, వైఎస్ జగన్మోహనరెడ్డి జైలుకు వెళ్లడం తథ్యమని జోష్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన దిల్‌షాద్ దున్నీషా, వైస్‌ఛైర్మన రాజశేఖరాచారి, సుధారాణి, గాండ్లపెంట ఎంపీపీ సోముశేఖర్‌రెడ్డిని ఎమ్మెల్యే అఽభినందించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆంజనప్ప మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలు కష్టాన్ని పార్టీ తప్పక గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు వహీదుసేన, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పీవీ వపన కుమార్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన, మున్సిపల్ ఛైర్‌పర్సన, వైస్ ఛైర్మన్లు, మహిళ నాయకురాలు ఫర్వీనభాను, కౌన్సిలర్లు, వార్డు ఇనఛార్జీలు, మండల కన్వీనర్లు, క్లస్టర్, యూనిట్, బూత ఇనచార్జీలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.