Share News

MLA DAGGUPATI: మరో 25 ఏళ్లు టీడీపీదే అధికారం

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:01 AM

మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటుందని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. స్థానిక అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA DAGGUPATI: మరో 25 ఏళ్లు టీడీపీదే అధికారం
MLA Daggubati is inquiring about the problems of the people.

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటుందని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. స్థానిక అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు కాలనీలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. కొందరు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకురాగా కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కిందకు దిగి వచ్చి వారి అర్జీలు స్వీకరించారు. హౌసింగ్‌, రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఐదేళ్లు ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, పేదల నుంచి డబ్బులు వసూలు చేసి, ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. నాయకులు గంగారామ్‌, సరిపూటి రమణ, హరికృష్ణ, బాలాంజినేయులు, కడియాల కొండన్న, ఫిరోజ్‌ అహ్మద్‌, సైపుద్దీన, పీఎల్‌ఎనమూర్తి, స్వామిదాస్‌, గోపాల్‌ గౌడ్‌, రాజారావు, ఓంకార్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


సేవలో భాగస్వామినవుతా: అంధ విద్యార్థులు, అనాథ నిరుద్యోగుల కోసం చేస్తున్న సేవలో తానూ భాగస్వామ్యుడిని అవుతానని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. బుధవారం స్థానిక హౌసింగ్‌ బోర్డులోని మీనాక్షమ్మ సమ్మిళిత కేంద్రంలో కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు సహకరించిన బెలుగుప్ప మండలం తగ్గుపర్తికి చెందిన రామకృష్ణను ఎమ్మెల్యే అభినందించారు. సమ్మిళిత కేంద్రం నిర్వాహకులు రవికాంత రమణ, నాయకులు వెంకటనారాయణ, దామోదర్‌నాయుడు, తిరుపతినాయుడు, శ్రీనాథ్‌, బొమ్మినేని శివ పాల్గొన్నారు.

రోడ్లు, కాలువల సమస్య ఉండకూడదు..

అనంతపురం న్యూటౌన: అనంతపురం రూరల్‌ పంచాయతీల్లో రోడ్లు, కాలువలు సమస్యలు ఉండకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విద్యుత, పంచాయతీరాజ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమిక్ష నిర్వహించి చర్చించారు. నియోజకవర్గ పరిధిలో నూతన విద్యుత సబ్‌స్టేషన్లు ఏర్పాటు అవసరం ఉందని, అందుకు అనుగుణంగా స్థల సేకరణ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ డీఈ లక్ష్మీనారాయణ, ఏఈ వెంకటశేషయ్య, ట్రాన్సకో ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌, ఈఈ రమేష్‌, డీఈఈ శ్రీనివాసులు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:01 AM