victory rally రేపు టీడీపీ విజయోత్సవ ర్యాలీ
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:24 AM
కూటమి ప్రభుత్వం అఖండ విజ యం సాధించి.. ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి పేర్కొన్నారు.
గుంతకల్లు, జూన 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అఖండ విజ యం సాధించి.. ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బలమైన కేడర్, కార్యకర్తల కృషి వల్లే గత ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను పలురకాలుగా ఇబ్బందులు పెట్టినా.. కార్యకర్తలు పార్టీని వీడకుండా.. అన్నివర్గాల వారిని వేధిస్తున్న జగన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కృషి చేశారన్నారు. ఈ విజయం సాధించి.. ఏడాది కావడంతో నిర్వహించే ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు ఆనంద్, బీఎస్ కృష్ణారెడ్డి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, పాల మల్లికార్జున, గుజరీ మహమ్మద్ ఖాజా, కృపాకర్, ఫజులు, అంజి పాల్గొన్నారు.