Share News

TDP మహానాడుకు భారీగా తరలిన టీడీపీ శ్రేణులు

ABN , Publish Date - May 29 , 2025 | 10:54 PM

తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు కదిరి నియోజకవర్గం నుంచి నుంచి వేలాది మంది టీడీపీ శ్రేణులు గురువారం తరలివెళ్లారు.

TDP మహానాడుకు భారీగా తరలిన టీడీపీ శ్రేణులు
ధర్మవరం : మహానాడుకు తరలివెళ్తున్న తెలుగు మహిళలు

కదిరి, మే 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు కదిరి నియోజకవర్గం నుంచి నుంచి వేలాది మంది టీడీపీ శ్రేణులు గురువారం తరలివెళ్లారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి 250కిపైగా బస్సులను ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా పలువురు నాయకులు, కార్యకర్తలు సొంతవాహనాలు, ఇతర ప్రైవేటు వాహనాల్లోనూ తరలివెళ్లారు. వేంపల్లి వద్ద ఈ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ శ్రేణులకు దాదాపు పదివేల మందికి ఎమ్మెల్యే భోజన ఏర్పాట్లు చేయించారు. పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో 185 వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. అలాగే ధర్మవరం, కొత్తచెరువు, నల్లమాడ, గాండ్లపెంట, అమడగూరు, ఓడీసీ, నల్లచెరువు, ఎన్పీకుంట మండలంలోని పి.కొత్తపల్లి నుంచి, తనకల్లు మండలంలోని కోర్తికోట నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.

Updated Date - May 29 , 2025 | 10:54 PM