TDP: శ్రేణులకు టీడీపీ అధిష్టానం అండ
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:12 AM
పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అనంతపురం అర్బన పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గురువారం ఆయన నగరంలోని పలువురు టీడీపీ నాయకులను కలిశారు.
అనంతపురం క్రైం, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అనంతపురం అర్బన పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గురువారం ఆయన నగరంలోని పలువురు టీడీపీ నాయకులను కలిశారు. హమాలీ కాలనీలో ఉన్న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ ఇంటికి వెళ్లారు. బంగి నాగ ఆయనను ఆహ్వానించారు. సోమిశెట్టి మాట్లాడుతూ...క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు టీడీపీ తోడుగా ఉంటుందన్నారు. ప్రజా సంఘాల నాయకులు బీసీఆర్ దాస్, బీకేఎస్ ఆనంద్, దాసాని కుళ్లాయప్ప, చిన్న కేశవులు, ఆదినారాయణ, సూరి, నరసింహులు, మల్లికార్జున, బంగి మల్లేష్, శ్రీనివాసచౌదరి, రమేష్, హనుమంతరావు, సత్య, మునియమ్మ, వెంకటేష్ గౌడ్, సాకే వెంకటేష్, సాకే చంద్రశేఖర్, రామాంజులు, సున్నం శీన, పృథ్వీ, సాదిక్, విద్యాసాగర్ రావు, సాయి, డేవిడ్ పాల్గొన్నారు.