compensation పరిహారం పెంచిన తర్వాతే పనులు చేపట్టండి
ABN , Publish Date - May 29 , 2025 | 10:56 PM
ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి జాతీయ రహదారి(342) విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు పరిహారం పెంచిన తర్వాతే పనులు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు.
ముదిగుబ్బ, మే 29(ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి జాతీయ రహదారి(342) విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు పరిహారం పెంచిన తర్వాతే పనులు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు నాలుగవ రోజైన గురువారమూ రోడ్డు పనులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ముదిగుబ్బ తహసీల్దార్ నారాయణస్వామి ఆ రైతులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. జిల్లా అధికారులతో మాట్లాడి.. న్యాయమైన పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. అందుకు రైతులు అంగీకరించలేదు. గ్రామసభలు కూడా నిర్వహించకుండా, పరిహారం ఎంత ఇ స్తారో తెలపకుండా పనులు ఎలా చేపట్టారని ప్రశ్నించారు. పరిహారం ఎంత ఇస్తారో తేల్చాలని, ఆ తర్వాతే పనులు చేపట్టాలని తేల్చిచెప్పారు.