MEO ఎంఈఓ రామచంద్రపై సస్సెన్షన ఎత్తివేత
ABN , Publish Date - Dec 11 , 2025 | 02:09 AM
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట ఎంఈఓ-2 రామచంద్రపై సస్పెన్షన ఎత్తివేశారు. ఈయన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల జడ్పీ హైస్కూల్ హెచఎంగా ఉన్న సమయంలో నాడు, నేడు పనుల్లో అక్రమాలు జరిగాయని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది.
అనంతపురం విద్య, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్ట ఎంఈఓ-2 రామచంద్రపై సస్పెన్షన ఎత్తివేశారు. ఈయన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల జడ్పీ హైస్కూల్ హెచఎంగా ఉన్న సమయంలో నాడు, నేడు పనుల్లో అక్రమాలు జరిగాయని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది.
దీంతో ఈఏడాది అక్టోబరు 28వ తేదీన ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అప్పట్లో రామచంద్ర వ్యక్తిగత కక్షతోనే నాడు,నేడు పనుల బూచి చూపి తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. తర్వాత నెలన్నరకు ఆయన సస్పెన్షనను ఎత్తివేస్తూ ఆర్జేడీ ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖకు పంపినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు బుధవారం తెలిపారు. అయితే ఎంఈఓ బాధ్యతల నుంచి తప్పించి డీ. హీరేహాళ్ మండలం ఓబుళాపురం జడ్పీ హైస్కూల్ హెచఎంగా నియమించినట్లు ఆర్జేడీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని డీఈఓ మీడియాకు వెల్లడించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..