సూర్యఘర్‌పై అవగాహన కల్పించండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:42 PM
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని విద్యుతశాఖ రాష్ట్ర డైరెక్టర్ గురువయ్య, ఎస్‌ఈ సంపతకుమార్ సూచించారు. బుధవారం ట్రాన్సకో ఈఈ కార్యాలయంలో విద్యుతశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విద్యుతశాఖ రాష్ట్ర డైరెక్టర్ గురువయ్య
హిందూపురం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని విద్యుతశాఖ రాష్ట్ర డైరెక్టర్ గురువయ్య, ఎస్‌ఈ సంపతకుమార్ సూచించారు. బుధవారం ట్రాన్సకో ఈఈ కార్యాలయంలో విద్యుతశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయానికి 9గంటలు నిరంతరంగా విద్యుత సరఫరా అందించాలన్నారు. కొత్త వ్యవసాయ విద్యుత కనెక్షనలు వెంటనే మంజూరు చేయాలన్నారు. వారికి అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్సీ,ఎస్టీ వినియోగదారులు ఇంటిపై సౌరప్యానల్ ఏర్పాటుచేసేందుకు వారి నుంచి సమ్మతిపత్రం తీసుకోవాలన్నారు. విద్యుత సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈఈ, ఏఈలు పాల్గొన్నారు.