Share News

పంటలకు మద్ధతు ధర కల్పించాలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:18 AM

కేంద్రప్రభుత్వం 2021 డిసెంబర్‌లో ఇచ్చిన జీవో ప్రకారం పంటల మద్ధతు ధర చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబులు డిమాండ్‌ చేశారు.

పంటలకు మద్ధతు ధర కల్పించాలి
మాట్లాడుతున్న సీఐటీయూ నేత ఓబులు

ఉరవకొండ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం 2021 డిసెంబర్‌లో ఇచ్చిన జీవో ప్రకారం పంటల మద్ధతు ధర చట్టాన్ని అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబులు డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం సంయుక్త కిసాన మోర్చా ట్రేడ్‌ యూనియన్ల పిలుపు మేరకు ఆందోళన నిర్వహించారు. ఎరువుల కొరత, బ్లాక్‌ మర్కెటింగ్‌, పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం, ప్రకృతి వైపరిత్యాలు.. తదితర వాటితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు, వ్యవసాయ కార్మికులకు రూ.10 వేలు పింఛన ఇవ్వాలని, ఎరువులపై కోత విధించిన రూ.87వేల కోట్ల సబ్సిడీని పునరుద్ధరించాలని, బ్లాక్‌ మార్కెట్‌ను నివారించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి, మధుసూధన, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:18 AM