చదువుకున్న పాఠశాలలకు చేయూత
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:39 AM
మండలంలోని ఆవులెన్న గ్రామానికి చెందిన ఉప్పర శ్రీనివాసులు ప్రస్తుతం యలగలవంక పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.
బెళుగుప్ప, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆవులెన్న గ్రామానికి చెందిన ఉప్పర శ్రీనివాసులు ప్రస్తుతం యలగలవంక పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఆయన తన సొంతూరైన ఆవులెన్నలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు, వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు, బెళుగుప్ప ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10 వరకు చదువుకున్నారు. స్వగ్రామంలోని పాఠశాలలో మొక్కలు నాటించారు. వెంకటాద్రిపల్లి, బెళుగుప్ప ఉన్నత పాఠశాలల్లోని టెన్త విద్యార్థులకు ఉచితంగా టెన్త మెటీరియల్‌ను అందజేశారు. బెళుగుప్ప ఉన్నత పాఠశాలకు గ్రిల్ నిర్మాణానికి రూ. 5 వేలు అందజేశారు.