Share News

సూపర్‌ సక్సెస్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:49 PM

అనంతపురంలో బుధవారం నిర్వహించిన సూపర్‌సిక్స్‌ ... సూపర్‌హిట్‌ సభకు ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ తరలివచ్చారు.

సూపర్‌ సక్సెస్‌
పామిడి వద్ద ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఏర్పాటు చేసిన శిబిరంలో భోజనం చేస్తున్న అభిమానులు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌ : అనంతపురంలో బుధవారం నిర్వహించిన సూపర్‌సిక్స్‌ ... సూపర్‌హిట్‌ సభకు ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ తరలివచ్చారు. గ్రామగ్రామాల నుంచి ఆయా ఎమ్మెల్యేలు బస్సులు ఏర్పాటు చేశారు. వచ్చిన కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా భోజనం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. ఒక్కో మండలం నుంచి కేవలం ఆర్టీసీ బస్సులే కాకుండా.. ప్రైవేట్‌, వ్యక్తిగత వాహనాల్లోనూ నాయకులు, కార్యకర్తలు తరలించారు. స్త్రీశక్తి పథకం నుంచి లబ్ధి పొందుతున్నామనే భావనతో అనేక మంది మహిళలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.

Updated Date - Sep 10 , 2025 | 11:49 PM