Share News

దుర్గం అభివృద్ధికి సలహాలివ్వండి :ఎమ్మెల్యే

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:23 PM

మున్సిపాల్టీని 2047ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తున్నామని, అందుకు పట్టణ ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కోరారు.

దుర్గం అభివృద్ధికి సలహాలివ్వండి :ఎమ్మెల్యే
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీని 2047ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తున్నామని, అందుకు పట్టణ ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కోరారు. మున్సిపాల్టీ మాస్టర్‌ప్లానపై కమిషనర్‌ వంశీకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాస్టర్‌ ప్లాన ఒక్కసారి అమలైతే 20 ఏళ్లు వరకు మార్చడానికి అవకాశం ఉండదన్నారు. పట్టణంలో క్రీడా మైదానం నిర్మిస్తామని, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తామ ని, దెబ్బతిన్న రహదారులను బాగు చేస్తామని, డ్రైనేజీ పనులు ముగింపు దశకు వ చ్చాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీరామ్‌రెడ్డి కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల జీతాలు రూ. 25 కోట్లు అందించిందన్నారు. అయినా వైసీపీ కాంట్రాక్టర్‌ కార్మికులను రెచ్చగొట్టి రెండు నెల ల ధర్నాలు చేయించి ప్రజలకు నీళ్లు సరఫరా చేయించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో వాల్మీకి ఫె డరేషన డైరక్టర్‌ వైపీ రమేష్‌, మార్కెట్‌ యా ర్డు వైస్‌ఛైర్మన కోనంకి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:23 PM