తగినంత యూరియా ఇవ్వాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:55 PM
రైతులకు తగినంత యూరియా పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బీ మల్లికార్జున డిమాండ్ చేశారు.
రాయదుర్గంరూరల్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రైతులకు తగినంత యూరియా పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బీ మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏడీఏ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులకు వినతిపత్రం అందించారు. మల్లికార్జున మాట్లాడుతూ.. అధిక వర్షాలు, హెచ్చెల్సీకి నీరు రావడంతో రైతులకు అధికంగా యూరియా అవసరమైందని, తగినంత యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా పుష్కలంగా ఉందంటూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు.