రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:19 AM
రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌లో బాక్సింగ్, ఉషు పోటీల్లో స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.
పుట్లూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌లో బాక్సింగ్, ఉషు పోటీల్లో స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాక్సింగ్ పోటీల్లో ప్రత్యూష వెండిపతకం, భార్గవి రజత పతకం, ఉషు క్రీడల్లో జగనమోహనరెడ్డి, కార్తీక్, అలీఫ్ వెండిపతకాలు, మధుకిరణ్, మణికంఠారెడ్డి రజత పతకాలు సాధించారని ఎంఈఓ శ్రీదేవి శుక్రవారం తెలిపారు. వారిని అభినందించారు.