Share News

జాతీయ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:09 AM

కర్నూలు జిల్లా కేంద్రంలోని కన్వెన్షన హాలులో ఆదివారం జరిగిన మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన ఆఫ్‌ ఇండియా కరాటే పోటీల్లో తాడిపత్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారని మాస్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

 జాతీయ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
బహుమతులతో విద్యార్థులు

తాడిపత్రి, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కేంద్రంలోని కన్వెన్షన హాలులో ఆదివారం జరిగిన మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన ఆఫ్‌ ఇండియా కరాటే పోటీల్లో తాడిపత్రి విద్యార్థులు ప్రతిభ కనబరిచారని మాస్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1600 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అండర్‌-14 విభాగంలో పట్టణానికి చెందిన 11 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఇందులో శ్రీవాణి స్కూల్‌కు చెందిన తొమ్మిది మంది అత్యంత ప్రతిభ కనబరిచారని అన్నారు. ఈ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ జేఎ్‌సకేఎస్‌ చీఫ్‌ జనరల్‌ సెక్రటరీ ప్రభాకర్‌, శేఖర్‌, జగదీష్‌ బహుమతులు అందజేశారన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:09 AM