వేళకు బస్సుల్లేవని విద్యార్థుల ధర్నా
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:31 AM
వేళకు సరిగా ఆర్టీసీ బస్సులు నడపడం లేదని మండలంలోని ఉంతకల్లు క్రాస్ వద్ద కళ్యాణదుర్గం, బళ్లారి రాహదారిపై కళాశాల, హైస్కూల్ విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులతో కలిసి మంగళవారం ధర్నా నిర్వహించారు.
బొమ్మనహాళ్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వేళకు సరిగా ఆర్టీసీ బస్సులు నడపడం లేదని మండలంలోని ఉంతకల్లు క్రాస్ వద్ద కళ్యాణదుర్గం, బళ్లారి రాహదారిపై కళాశాల, హైస్కూల్ విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులతో కలిసి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఉదయం, సాయంత్ర సమయాల్లో బస్సులు లేకపోవడంతో విద్యా సంస్థలకు, ఇళ్లకు ఆలస్యంగా వెళ్తున్నామని వాపోయారు. దాదాపు గంట సేపు ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. బస్సులు సమయానికి వచ్చేలా అధికారులతో మాట్లాడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ప్రజాసంఘాల నాయకులు నాగవేణి, శివ పాల్గొన్నారు.