Share News

CHEKUMUKI : విద్యార్థులకు సృజనాత్మకత అవసరం

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:58 PM

విద్యార్థులకు సైన్సతో కూడిన సృజనాత్మకత అవసరమని జీవశాస్త్ర అధ్యాపకురాలు అరుణ అన్నారు. జనవిజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కేఎ్‌సఆర్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చెకుముకి మండలస్థాయి సైన్స సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

CHEKUMUKI : విద్యార్థులకు సృజనాత్మకత అవసరం
Aruna, the teacher who is speaking

అనంతపురం టౌన, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సైన్సతో కూడిన సృజనాత్మకత అవసరమని జీవశాస్త్ర అధ్యాపకురాలు అరుణ అన్నారు. జనవిజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కేఎ్‌సఆర్‌ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన చెకుముకి మండలస్థాయి సైన్స సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో శాస్త్రీయ ఆలోచనలతో కూడిన విద్యాభ్యాసం ఎంతో అవసరమని, అలాంటివారు మాత్రమే జీవితంలో ఉన్నతస్థాయిలో రాణించగలుగుతున్నారని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన చెకుముకి సైన్స సంబరాల పరీక్షల్లో 52 జట్లకు 156 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జేవీవీ నగర అధ్యక్ష కార్యదర్శులు కేఎనఎ్‌స ప్రసాద్‌రెడ్డి, సాకే తిరుమల్‌, నారాయణప్ప, కోశాధికారి రామిరెడ్డి, రామకృష్ణ, లక్ష్మినారాయణ, ప్రసాద్‌, ముత్యాలు, మారెన్న, సమత నాయకురాలు నాగరత్న పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:58 PM