JC కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు : జేసీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:37 PM
వివిధ రకాల పండ్లను మగ్గపెట్టడానికి కార్బైడ్ తదితర రసాయనాలను ఉపయోగిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ అభిషేక్‌కుమార్ హెచ్చరించారు.
పుట్టపర్తిటౌన, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): వివిధ రకాల పండ్లను మగ్గపెట్టడానికి కార్బైడ్ తదితర రసాయనాలను ఉపయోగిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ అభిషేక్‌కుమార్ హెచ్చరించారు. బుధవా రం కలెక్టరేట్‌లోని ఆహార సంరక్షణ, ప్రమాణాల చట్టం అమలుపై సం బంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మామిడి, అరటి, బొప్పాయి, దానిమ్మ, సపోటా తదితర పండ్లను కృత్రిమ పద్ధతిలో మగ్గపెట్టాలని, రసాయనాలను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని అన్నారు. పండ్లును మగ్గపెట్టే వ్యాపారులపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తామన్నారు. ఎవరైనా రసాయనాలు ఉపయోగించినట్లు తేలితే.. వారికి రూ.లక్ష జరిమానా, ఆరునెలలు జైలు శిక్ష తప్పందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఆహార భద్రతాధికారులు తస్మిలిమా, రామచంద్రగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఉద్యాన వనశాఖాధికారి చంద్రశేఖర్, పుట్టపర్తి కమిషనర్ ప్రహ్లాదా పాల్గొన్నారు.