Share News

Strict action రసాయనాలు వాడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 22 , 2025 | 11:51 PM

సత్యసాయి జిల్లాలో ఎవరైన మామిడి, యాపిల్‌ ఇతర పండ్లను హానికర రసాయనాలతో మాగపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ రామచంద్ర హెచ్చరించారు.

Strict action రసాయనాలు వాడితే కఠిన చర్యలు
పండ్లను పరిశీలిస్తున్న జిల్లా ఫుడ్‌ ఇనస్పెక్టర్‌

ధర్మవరం, మే 22(ఆంధ్రజ్యోతి): సత్యసాయి జిల్లాలో ఎవరైన మామిడి, యాపిల్‌ ఇతర పండ్లను హానికర రసాయనాలతో మాగపెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ రామచంద్ర హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ధర్మవరం పట్టణంలో ఐదు మండీలను తనిఖీ చేసి వాటిలో సాంపిల్స్‌ తీసుకుని హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు. పండ్లను రసాయనాలతో మాగపెడుతున్నట్టు తెలితే ఎఫ్‌ఎ్‌సఎ్‌ససీఐ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని ఆయన తెలిపారు.

Updated Date - May 22 , 2025 | 11:51 PM