Share News

Palle టీడీపీని బలోపేతం చేయండి : పల్లె

ABN , Publish Date - May 14 , 2025 | 12:06 AM

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సూచించారు.

Palle టీడీపీని బలోపేతం చేయండి :  పల్లె
మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె

నల్లమాడ, మే 13(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాథనిక షాదీమహాల్‌లో కార్యకర్తలతో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల కృషితోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 2029లోపు అన్ని చెరువులకు నీరు ఇచ్చి, నియోజకవర్గానికి మరో కోస్తా ఆంధ్రగా మార్చుతామన్నారు. అనంతరం మండలంలో గ్రామ, సాధికార సారధి, బూత కమిటీలను, అధ్యక్షులు, కన్వీనర్లు, కో కన్వీనర్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మైలే శివశంకర్‌, మాజీ కన్వీనర్‌ కేశవరెడ్డి, సర్పంచలు భారతి, ప్రభాకర్‌రెడ్డి, నాయకులు బుట్టి నాగభూషణనాయుడు, ఎల్‌ఐసీ నరసింహులు, గడ్డం రమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:06 AM