not work వెలగలని వీధి లైట్లు
ABN , Publish Date - May 18 , 2025 | 11:10 PM
మండల కేంద్రంమైన తనకల్లు, మండలంలోని కొక్కంటిక్రా్‌సలో జాతీయ రహదారిలోని డివైడర్లపై ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగడం లేదు.
తనకల్లు, మే 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంమైన తనకల్లు, మండలంలోని కొక్కంటిక్రా్‌సలో జాతీయ రహదారిలోని డివైడర్లపై ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగడం లేదు. కొక్కంటి క్రాస్‌లో కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు స్తంభాల దీపాలూ వెలగడం లేదు. నాలుగేళ్ల క్రితం జాతీయ రహదారి విస్తరణ చేసి .. డివైడర్ల ఏర్పాటు .. వాటిపై వీధి దీపాలను ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాటు ఆ దీపాలు బాగా పనిచేశాయి. ఆ తర్వాత అవి చెడిపోయాయి. దీంతో గ్రామస్థులు జాతీయ రహదారుల అధికారులకు ఫిర్యాదు చేస్తే .. తమకు సంబంధం లేదని తాము పంచాయతీలకు అప్పగించామని అంటున్నారు. పంచాయతీ అధికారులను అడిగితే తమకేమీ సంబంధం లేదని, తమకు ఎవరూ అప్పగించలేదని అంటున్నారు. ఇలా ఇరుశాఖల మధ్య సమన్వయం లోపం వల్ల రెండేళ్లుగా ఈ వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.