నిత్యం వెలుగుతున్న వీధిదీపాలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:04 AM
పంచాయతీ, విద్యుత అ ధికారులు పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్ల మండలంలో పలు గ్రామాల్లో వీ ధిదీపాలు నిరంతరం వెలుగుతూనే ఉ న్నాయి.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ, విద్యుత అ ధికారులు పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్ల మండలంలో పలు గ్రామాల్లో వీ ధిదీపాలు నిరంతరం వెలుగుతూనే ఉ న్నాయి. దీంతో వందలాది యూనిట్లు విద్యుత వృథా అవుతుంది. ఫలితంగా విద్యుతశాఖ, పంచాయతీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రత్యేక లైనలు, ఆనఆ్‌ఫ స్వీచలను ఏర్పాటు చేసి సమస్య ను పరిష్కరించాల్సిన అధికారులు ఆ ది శగా చర్యలు చేపట్టడం లేదు. దీనిపై డిప్యూటీ ఎంపీడీఓ దాస్‌ను వివరణ కోర గా... మండలంలో అన్ని వీధిలైట్లకు ఆన ఆఫ్ స్విచలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో వీధిలైట్లకు ప్రత్యేక వైరును విద్యుత అధికారులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.