Stray dog వీధికుక్కల బెడద
ABN , Publish Date - May 24 , 2025 | 11:15 PM
అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో వీధికుక్కలు ఎక్కువయ్యాయని, వాటి బారి నుంచి కాపాడాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు
అమడగూరు (కదిరి), మే 24 (ఆంధ్రజ్యోతి): అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో వీధికుక్కలు ఎక్కువయ్యాయని, వాటి బారి నుంచి కాపాడాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో కుక్కల సంఖ్య దాదా పు రెండువందలకు చేరిందని, దీంతో గ్రామంలో తిరగాలంటేనే భయంగా ఉంటోందని ఆ గ్రామస్థులు తిరుపాల్, నరసింహులు వాపోయారు. ద్విచక్రవాహనాల్లో వెళ్లేవారిని వెంబడించి.. గాయపర్చుతున్నాయన్నారు. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి బైక్‌ల్లో వేగంగా వెళ్తూ అనేక మంది కిందపడి గాయపడ్డారన్నారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న గొర్రెల మందలోకి చోరబడి చంపుతున్నట్లు చెప్పారు. రాత్రి 8 గంటలైతే ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారన్నారు. వీటిని కట్టడి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి జానకీని వివరణ కోరగా .. కుక్కలకు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.