stolen: స్టార్టర్లు చోరీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:13 AM
మండల పరిధిలోని హేమావతి గ్రామంలో పురవర చెరువుకు ఆనుకొని ఉన్న తాగునీటి బోరుకు సంబంధించిన స్టార్టర్‌ను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆరు నెలల కిందట ఇదే విధంగా తాగు నీటి బోరు కేబుల్‌వైర్‌ను దొంగలించారని పంచాయతీ కార్యదర్శి నరేష్‌బాబు తెలిపారు. ఉదయమే వాటర్‌మన తాగునీటి బోరు మోటారును ఆన చేద్దామని వెళ్లగా స్టార్టర్‌ను దొంగలించినట్లు గుర్తించారు.

అమరాపురం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని హేమావతి గ్రామంలో పురవర చెరువుకు ఆనుకొని ఉన్న తాగునీటి బోరుకు సంబంధించిన స్టార్టర్‌ను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆరు నెలల కిందట ఇదే విధంగా తాగు నీటి బోరు కేబుల్‌వైర్‌ను దొంగలించారని పంచాయతీ కార్యదర్శి నరేష్‌బాబు తెలిపారు. ఉదయమే వాటర్‌మన తాగునీటి బోరు మోటారును ఆన చేద్దామని వెళ్లగా స్టార్టర్‌ను దొంగలించినట్లు గుర్తించారు. ఈవిషయాన్ని పంచాయతీ కార్యదర్శికి తెలిపారు. పంచాయతీ కార్యదర్శి బోరు వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. పంచాయతీ కార్యదర్శి గ్రామస్థులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో పంచాయతీ కార్యదర్శి నరేష్‌తో పాటు ఎంపీటీసీ ఓంకార్‌స్వామి, పంచాయతీ కన్వీనర్ తిప్పజ్జ, తదితరులు పాల్గొన్నారు.