స్కూల్లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:05 AM
మండలంలోని కైరేవు హైస్కూల్లో తాగునీటి సమస్య ఉంది. విద్యార్థులు ఇళ్ల నుంచే తాగునీటి తెచ్చుకొంటున్నారు.
శెట్టూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని కైరేవు హైస్కూల్లో తాగునీటి సమస్య ఉంది. విద్యార్థులు ఇళ్ల నుంచే తాగునీటి తెచ్చుకొంటున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇబ్బందులు పడేవారు. దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యను టీడీపీ నాయకుడు బోయ రామాంజినేయులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తన సొంత డబ్బుతో ఆదివారం ఆ పాఠశాలలో బోరు వేయించాడు. 140 అడుగుల్లో నీరు పడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గాజుల మనోహర్, స్కూల్ కమిటీ ఛైర్మన కల్లేశ్వర, జీ లక్ష్మణమూర్తి, అంజి, కరెన్న, అబ్దుల్ బ్రహ్మయ్య గ్రామస్థులు పాల్గొన్నారు.