రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:35 AM
స్థానిక సెంట్రల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి 28వ సబ్ జూనియర్ సెపక్ తక్రా పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఉరవకొండ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక సెంట్రల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి 28వ సబ్ జూనియర్ సెపక్ తక్రా పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 17 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఆ క్రీడాకారులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. అనంతరం క్రీడా జెండాను ఎగురవేసి, క్రీడా జ్యోతిని వెలిగించారు. డీఎ్‌సడీఓ మంజుల, సెపక్‌తక్రా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉరవకొండలోనే రెండుసార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిచామన్నారు. అనంతరం వివిధ జిల్లాల క్రీడాకారులు పోటీల్లో తలపడ్డారు. ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ కార్యక్రమంలో హెచఎం రాజేశ్వరి, కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఎంఈఓ ఈశ్వరయ్య, సెపక్ తక్రా జిల్లా సంఘం చైర్మెన మల్లికార్జున, అధ్యక్షుడు షాహిన, అనంతపురం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు నాగరాజు, సత్యసాయి జిల్లా స్కూల్ గేమ్స్ మాజీ కార్యదర్శి మొరార్జీ, వ్యాయామ ఉపాధ్యాయుడు మారుతి, రాఘవేంద్ర, నాగరాజు, మంజునాథ్, జనార్ధన, శివకుమార్ పాల్గొన్నారు.