భక్తిశ్రద్ధలతో శ్రీరాజరాజేశ్వరిదేవి హోమం
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:51 PM
మండలంలోని మల్లాపురం గ్రామం శ్రీ విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని విశ్వమాత ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి హోమాన్ని మంగళవా రం ఘనంగా నిర్వహించారు.
రాయదుర్గంరూరల్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి) : మండలంలోని మల్లాపురం గ్రామం శ్రీ విప్రమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని విశ్వమాత ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి హోమాన్ని మంగళవా రం ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి ఉదయం సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, పు ష్పాలంకరణ, మహా మంగళహారతి నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి హోమం నిర్వహించారు. 105 మంది మహిళలు సామూహిక లలిత సహస్త్రనామ పారాయణం చేశారు. పూర్ణాహుతి, మహామంగళహారతి నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు శ్రీ రామమూర్తి స్వామి ఇందులో పాల్గొన్నారు.