చేతి పంపు నుంచి ఊట నీరు
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:47 PM
స్థానిక రజక కాలనీలో గంగమ్మ ఇంటి దగ్గర ఉన్న చేతిపంపు నుంచి ఏకధాటిగా ఊట నీరు వస్తోంది. కొన్నేళ్ల క్రితం వేసిన ఈ బోరువేసి పంపు బిగించారు.
బెళుగుప్ప, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): స్థానిక రజక కాలనీలో గంగమ్మ ఇంటి దగ్గర ఉన్న చేతిపంపు నుంచి ఏకధాటిగా ఊట నీరు వస్తోంది. కొన్నేళ్ల క్రితం వేసిన ఈ బోరువేసి పంపు బిగించారు. రెండు నెలల నుంచి రేయింబవళ్లు నీరు వస్తూనే ఉంది. గతంలో వెయ్యి అడుగుల లోతున బోర్లు వేసినా చుక్కనీరు దొరక్క రైతులు ఇబ్బందులు పడేవారు. ఇటీవల కురిసిన వర్షాలు భూగర్భ జాలాలు బాగా పెరిగాయి. దీంతో అందుకు ఈ బోరే నిదర్శనం. అంతేకాకుండా వ్యావసాయ బోర్లలనూ నీరు పుష్కలంగా ఉంటోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.