Share News

విద్యార్థులకు క్రీడాపోటీలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:45 PM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజ క్రాంతి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండలంలోని విద్యార్థులకు ఆదివారం క్రీడాపోటీలు నిర్వహించారు.

విద్యార్థులకు క్రీడాపోటీలు
క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులతో ట్రస్టు వ్యవస్థాపకులు, ఉపాధ్యాయులు

కుందుర్పి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజ క్రాంతి ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండలంలోని విద్యార్థులకు ఆదివారం క్రీడాపోటీలు నిర్వహించారు. పిల్లలు పరుగుపందెం, స్కిప్పింగ్‌, కాలినడక, మ్యూజికల్‌ ఛైర్స్‌ పోటీలతో పాటు దేశభక్తిని ప్రేరేపించే పాటలు పోటీల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందులో ఆ ట్రస్టు వ్యవస్థాపకుడు లెనిన బాబు, ట్రస్టు సభ్యులు సాయి, చరణ్‌, శ్రీకాంత దిలీప్‌, ఉపాధ్యాయులు నింగప్ప, రఘు, హనుమంతరాయుడు, అనిత పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:45 PM