ప్రత్యేక రైలు తిరుపతి వరకు పొడిగింపు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:19 AM
చర్లపల్లి-రక్సల్-చర్లపల్లి మధ్య నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైలును తిరుపతి వరకు (వయా గుంతకల్లు) పొడిగించినట్లు రైల్వే అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు.
గుంతకల్లు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): చర్లపల్లి-రక్సల్-చర్లపల్లి మధ్య నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైలును తిరుపతి వరకు (వయా గుంతకల్లు) పొడిగించినట్లు రైల్వే అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. తిరుపతి-రక్సల్ ప్రత్యేక వీక్లీ రైలు (07051) ఈనెల 27 నుంచి నవంబరు 29వ తేదీ వరకూ తిరుపతిలో ఉదయం 8.36 గంటలకు బయలుదేరి సోమవారాల్లో మధ్యాహ్నం ఒకటిన్నరకు రక్సల్‌కు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07052) రక్సల్‌లో మంగళవారాల్లో ఉదయం ఎనిమిదిన్నరకు రక్సల్‌లో బయలుదేరి గురువారం సాయంత్రం ఆరున్నరకు తిరుపతికి చేరుతుందన్నారు. ఈ రైలు సితమరి, దర్భంగా, సమస్తిపూర్, బరౌనీ, కియుల్, జాఝా, జసిది, మధుపూర్, చిత్తరంజన, బరాకర్, ధనబాద్, చంద్రపుర, బకరో స్టీల్ సిటీ, యురి, హతియా, రూర్కెలా, ఝర్సుగుడా, బిలా్‌సపూర్, రాయపూర్, దుర్గ్, గోండియా, వాడ్సా, చంద్రా ఫోర్ట్, బలార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట్, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, క్రిష్ణా, రాయచూరు, మంచిర్యాల రోడ్డు, ఆదోని, గుంతకల్లు, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుందని వివరించారు.