Collector అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ : కలెక్టర్
ABN , Publish Date - May 19 , 2025 | 11:32 PM
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు
పుట్టపర్తిటౌన, మే19 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ 206 అర్జీలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జేసీ అభిషేక్‌కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, పశుసంవర్ధకశాఖ జేడీ సుబదాస్, సిరికల్చర్ జేడీ పద్మావతి, ఎల్‌ఎండీ రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.