Share News

Sp Shakti మహిళల భద్రతకు ప్రాధాన్యం: ఎస్పీ

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:57 PM

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, వారి కోసం జిల్లాలో ఆరు శక్తి బృందాలను రంగంలోకి దింపామని ఎస్పీ వి.రత్న అన్నారు. ‘శక్తి.. మీ రక్షణ మా కర్తవ్యం’ అనే నినాదంతో రూపొందించిన ద్విచక్రవాహనాలను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆమె ప్రారంభించారు.

Sp Shakti మహిళల భద్రతకు ప్రాధాన్యం: ఎస్పీ
శక్తి వాహనాలను ప్రారంభిస్తున్న ఎస్పీ రత్న

శక్తి బృందాల వాహనాలు ప్రారంభం

పుట్టపర్తి రూరల్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, వారి కోసం జిల్లాలో ఆరు శక్తి బృందాలను రంగంలోకి దింపామని ఎస్పీ వి.రత్న అన్నారు. ‘శక్తి.. మీ రక్షణ మా కర్తవ్యం’ అనే నినాదంతో రూపొందించిన ద్విచక్రవాహనాలను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆమె ప్రారంభించారు. శాంతి కపోతాలను ఎగురవేసి, స్వేచ్ఛ,చైతన్యం, భద్రత నినాదంతో శక్తి బృందాలు పనిచేయాలని సూచించారు. శక్తి బృందాలు 24 గంటలు విధి నిర్వహణలో ఉంటాయని తెలిపారు. బాలికలు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సకాలంలో స్పందిస్తాయని అన్నారు. ఆపద సమయంలో శక్తియాప్‌ నుంచి వచ్చే ఎస్‌ఓఎస్‌ కాల్స్‌, డయల్‌ 112/100 కాల్స్‌కు స్పందించి.. సంఘటనా స్థలానికి శక్తి టీంలు తక్షణమే వెళతాయని అన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌ స్టేషన డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌ కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:57 PM