plz save అంజనీపుత్రా.. పాహిమాం..!
ABN , Publish Date - May 22 , 2025 | 11:35 PM
హనుమ జ్జయం తిని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియో జకవ ర్గాల్లోని రామాలయాలు, ఆంజనే యస్వామి, ఇతర ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : హనుమ జ్జయం తిని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియో జకవ ర్గాల్లోని రామాలయాలు, ఆంజనే యస్వామి, ఇతర ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ధర్మవరంలో విశ్వహిందూ పరిషత ఆధ్వర్యంలో శోభాయాత్ర బైకు ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలోని ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. బీడిపల్లిలోని అభయాం జనేయస్వామి ఆలయంలో యజ్ఞాన్ని నిర్వహించారు. తాడిమర్రి, మండ లంలోని పట్రపల్లి సంజీవరాయుడుస్వామి ఆలయంలో, పుల్ల ప్పల్లి, నిడిగల్లు, తాడిమర్రి మద్దెలచెరువు గ్రామాల్లోని ఆంజనేయస్వామికి పూజలు నిర్వ హించారు. ముదిగుబ్బలోని పాతవూరులో శ్రీసూర్య చంద్ర అభయ ఆంజనేయస్వామిని వెన్నతో అలంకరించారు. బత్తలపల్లి, మండ లంలోని పోట్లమర్రి, మాల్యవంతం, గ్రామా ల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.