Share News

నీటి, చెత్త సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:41 AM

పట్టణంలో తిష్టవేసిన తాగునీటి, చెత్త సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు.

నీటి, చెత్త సమస్యలు పరిష్కరించండి
మాట్లాడుతున్న టీడీపీ కౌన్సిలర్‌ కే కృపాకర్‌

గుంతకల్లు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో తిష్టవేసిన తాగునీటి, చెత్త సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. శుక్రవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో చైర్‌పర్సన ఎన భవాని అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. కౌన్సిలరు కే కృపాకర్‌ మాట్లాడుతూ..ఉన్న నిధులన్నీ ధర్మవరం గేటు నిర్మాణం కోసం కాంట్రిబ్యూషన, పరిహారాలు, పైప్‌లైన షిఫ్టింగ్‌కే వెచ్చిస్తే వార్డుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కౌన్సిలరు పవనకుమార్‌ గౌడు మాట్లాడుతూ.. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో తగినన్ని నీటి నిల్వలున్నా, పట్టణంలో కొన్ని వార్డుల్లో వారానికి ఓసారి, మరికొన్ని చోట్ల పది రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారన్నారు. వైస్‌ చైర్‌పర్సన నైరుతి మాట్లాడుతూ.. ఆర్‌యూబీ కోసం స్థలాల పరిహారాల కోసం రైల్వే ఇచ్చిన రూ. 2.5 కోట్లను ఏంచేశారని ప్రశ్నించారు. ఇందులో వైస్‌చైర్‌పర్సన మైమున, మున్సిపల్‌ కమిషనర్‌ నయ్యీం అహ్మద్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:41 AM