Share News

తాగునీటి సమస్య పరిష్కరించండి

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:01 AM

కొన్ని నెలలుగా తాగునీటి సమస్యతో తాము ఇబ్బందులు పడుతున్నామని కొలిమిపాల్యం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాగునీటి సమస్య పరిష్కరించండి
ఖాళీబిందెలతో నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

కుందుర్పి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కొన్ని నెలలుగా తాగునీటి సమస్యతో తాము ఇబ్బందులు పడుతున్నామని కొలిమిపాల్యం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ గ్రామస్థులు ఆదివారం ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినా.. వారు పట్టించుకోలేదన్నారు. తాము నీటి కోసం పొలాలకు వెళ్తున్నామని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.

Updated Date - Dec 08 , 2025 | 12:01 AM