తాగునీటి సమస్య పరిష్కరించండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:38 AM
స్థానిక కనసయ్యగుట్ట కాలనీలో 15 రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు.
కుందుర్పి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక కనసయ్యగుట్ట కాలనీలో 15 రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆ కాలనీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. సమస్యను స్థానిక ఎంపీడీఓ అధికారులకు తెలపాలని పోలీసులు సూచించడంతో వారు ఎంపీడీఓ కార్యాలయ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. డిప్యూటీ ఎంపీడీఓ హరికృష్ణ బాలాజీ మాట్లాడుతు.. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, అంతవరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.