ప్రజా సమస్యలు పరిష్కరించండి : మంత్రి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:34 PM
సమస్యలపై ప్రజలు చేసే ఫిర్యాదులపై వెంటనే స్పందించి.. వాటిని పరిష్కరించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు సూచించారు.
ఉరవకొండ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): సమస్యలపై ప్రజలు చేసే ఫిర్యాదులపై వెంటనే స్పందించి.. వాటిని పరిష్కరించాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు సూచించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాలు స్వీకరించారు. తొగట వీర క్షత్రి కల్యాణ మండపం అభివృద్ధికి సహకరించాలని టీడీపీ చేనేత విభాగం నాయకులు వేల్పుల శ్రీనివాసులు, పెద్దకోట్ల శ్రీన మంత్రిని కోరారు. గురుకుల పాఠశాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఏపీఎ్‌సడబ్య్లూ ఆర్‌ఐఈఎస్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వినతి పత్రాలు మంత్రికి అందాయి. గవిమఠం ఆవరణంలో మార్కెట్ ఏర్పాటు కోసం స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ ఐడీసీ మాజీ డైరెక్టర్ దేవినేని పురుషోత్తం, గవిమఠం ఏసీ రాణి, తహసీల్దార్ మహబూబ్‌బాషా, పంచాయతీ కార్యదర్శి గౌస్ పాల్గొన్నారు.