Share News

ఘనంగా గౌరమ్మ నిమజ్జనం

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:17 AM

గౌరమ్మ వేడుకల్లో భాగంగా మం డలంలోని హావళిగిలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు గౌరమ్మ దేవికి మంగళ హారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఘనంగా గౌరమ్మ నిమజ్జనం
విడపనకల్లులో అమ్మవారిని ఊరేగిస్తున్న గ్రామస్థులు

విడపనకల్లు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): గౌరమ్మ వేడుకల్లో భాగంగా మం డలంలోని హావళిగిలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు గౌరమ్మ దేవికి మంగళ హారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని పూల రథంలో ఊరేగించారు. గ్రామంలోని చెరువు వద్ద ఉన్న బావిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు.

బొమ్మనహాళ్‌ : మండలంలోని గోవిందవాడలో కడ్లేగౌరమ్మకు చక్కెరహారతుల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు, యువతులు కడ్లేగౌరమ్మకు పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియ్యం సమర్పించి పూజ లు నిర్వహించి హారతులు ఇచ్చారు. వేలాది మంది అమ్మవారిని దర్శించుకున్నారు. టీడీపీ నాయకులు సోమనాథ్‌గౌడ్‌, రాతింటి వన్నూరుస్వామి, సుంకన్న, ఎస్‌జీ వన్నూరుస్వామి, బంగిలోకేష్‌, నటరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:17 AM