ఘనంగా గజగౌరీ నిమజ్జనం
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:44 PM
మండలంలోని ఉంత కల్లు, ఉద్ధేహాళ్, ఉప్పరహాళ్ తదితర గ్రామాల్లో గజగౌరీ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
బొమ్మనహాళ్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంత కల్లు, ఉద్ధేహాళ్, ఉప్పరహాళ్ తదితర గ్రామాల్లో గజగౌరీ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేకువ జామునే గజగౌరీని జ్యోతులతో ఊరేగించి.. నిమజ్జనం చేశారు. కోలాటాలు, నృత్యాలతో అమ్మవారిని సాగనంపారు. ఉద్ధేహాళ్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన రాతిదులం పోటీల్లో 15 జతల వృషభాలు పాల్గొన్నాయి.