crops are drying సార్.. పంటలు ఎండుతున్నాయ్..!
ABN , Publish Date - May 18 , 2025 | 12:01 AM
మండలంలోని చిగిచెర్ల గ్రామంలో నాలుగు రోజుల క్రితం వీచిన ఈదురు గాలులకు విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ధర్మవరంరూరల్, మే17(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిగిచెర్ల గ్రామంలో నాలుగు రోజుల క్రితం వీచిన ఈదురు గాలులకు విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నాటి నుంచి అధికారులు విద్యుత సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి.. ప ట్టించుకోండి సార్ అంటూ పలువురు రైతులు వేడుకున్నా.. ఆ అధికారులు కరుణించలేదు.
మండలంలోని చిగిచెర్ల గ్రామానికి సంబంధించి రైతుల పొలాల్లో సుమారు 100 బోర్లకు పైగా విద్యుత సరఫరా గొట్లూరు సబ్‌స్టేషన నుంచి సరఫరా అవుతోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఈదురు గాలులకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కనీసం మండల ఏఈకు, లైనమెన్లకు ఫోనలు చేసినా వారు ఫోన కూడా ఎత్తడం లేదని, అసలు ఏమిజరిగింది .. ఎప్పు డు కరెంట్ వస్తుంది.. అనే సమాచారం కూడా ఇచ్చేవారే లేరని పలువురు రైతులు మండిపడుతున్నారు. విద్యుతశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి పంటలను కాపాడాలని కోరుతున్నారు.
చిగిచెర్ల గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి, హనుమంతరెడ్డి రెండు ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తున్నారు. టమోటా నారు నాటిన తర్వాత ప్రతి మూడు రోజుల కొకసారి నీరు పెట్టాల్సి ఉంది. అయితే విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడి నాలుగు రోజులుగా కరెంట్ రాకపోవడంతో నాటిన టమోటా నార ఎండు దశకు చేరింది. వేలకు వేలు వెచ్చించి పెట్టుబడులు పెట్టి పంటలు సాగుచేసుకుంటున్నామని, కరెంట్ కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆ రైతులు వాపోతున్నారు. కరెంట్ సరఫరా చేయాలని ట్రాన్సకో అధికారులకు తెలిపినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతి ఏఈ జానకీరామయ్యను ఫోనలో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఏడీ నరసింహరెడ్డిని సంప్రదించగా .. విద్యుత సరఫరా ఆగిపోయినట్లు తన దృష్టికి రాలేదన్నారు.