యోగా మాస్టార్‌కు వెండి పతకం
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:46 PM
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడులోని సరస్వతి విద్యాలయంలో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో స్థానిక జూనియర్ కళాశాల యోగా మాస్టార్ సుబ్బారాయుడు ప్రతిభ చాటాడు.
బొమ్మనహాళ్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడులోని సరస్వతి విద్యాలయంలో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో స్థానిక జూనియర్ కళాశాల యోగా మాస్టార్ సుబ్బారాయుడు ప్రతిభ చాటాడు. ఆయనకు సోమవారం సినియర్-సి సిల్వర్ పతకాన్ని అందజేసి .. సన్మానించారు. ఆయన్ను స్థానిక ఇనచార్జి ప్రిన్సిపాల్ హనుమంతనాయక్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.