Share News

షాపింగ్‌ కాంప్లెక్స్‌ సీజ్‌

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:50 PM

యాడికిలో అహుడా అనుమతులు లేకుండా నిర్మించిన ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ను డిప్యూటి ఎంపీడీఓ శశికళ శుక్రవారం సీజ్‌ చేశారు.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ సీజ్‌
షాపింగ్‌ కాంప్లెక్స్‌ను సీజ్‌ చేస్తున్న సిబ్బంది

యాడికి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): యాడికిలో అహుడా అనుమతులు లేకుండా నిర్మించిన ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ను డిప్యూటి ఎంపీడీఓ శశికళ శుక్రవారం సీజ్‌ చేశారు. ఆమె మాట్లాడుతూ.. యాడికికి చెందిన కొమ్మా గుణదీప్‌రెడ్డి ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అధికారులతో అనుమతి తీసుకొని.. అందులో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారని, దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని గదులన్నింటిని సీజ్‌ చేశామని తెలిపారు. అహుడా అనుమతులు తీసుకున్న తర్వాత షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభానికి అనుమతి ఇస్తామన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:50 PM