Share News

బడిచుట్టూ మురుగు

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:26 AM

స్థానిక ఎస్‌ఎల్‌వీ టాకీస్‌ సమీపంలో రవీంధ్రనాథ్‌ ఠాగూరు మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఉంటూ మురుగునీరు నిల్వ ఉంటోంది.

బడిచుట్టూ మురుగు
పాఠశాల చుట్టూ నిల్వ ఉన్న మురుగునీరు

గుంతకల్లుటౌన, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎస్‌ఎల్‌వీ టాకీస్‌ సమీపంలో రవీంధ్రనాథ్‌ ఠాగూరు మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఉంటూ మురుగునీరు నిల్వ ఉంటోంది. ఆ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు విద్యన అభ్యసిస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో నాడు నేడు కింద పాఠశాల మరమ్మతులు, ప్రహారీని నిర్మించారు. అయితే మురుగు కాలువ నిర్మించకుండా వదిలేశారు. దీంతో ఆ పాఠశాలలోకి వెళ్లేందుకు కూడా దారి లేకపోవడంతో ఉపాధ్యాయులు రాళ్లు పెట్టి వాటి మీద చిన్న బండను ఏర్పాటు చేశారు. ఆ బండ మీడ వెళ్లేటప్పుడు విద్యార్థులు ఎక్కడ మురుగులో పడి గాయపడతారో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల చుట్టూ మురుగు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ నయీమ్‌ఆహ్మద్‌కు వివరణ కోరగా పాఠశాల చుట్టూ మురుగు కాలువలు ఎందుకు ఏర్పాటు చేయలేదో విచారిస్తామని, విద్యార్థులు, సిబ్బంకి ఇబ్బందులు లేకుండా కాలువ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:26 AM