రోడ్లపై మురుగు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:31 AM
మండలంలోని సిద్ధరాంపురంలో మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు ఇలా రోడ్లపైనే నిల్వ ఉంటోంది.
బొమ్మనహాళ్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి) మండలంలోని సిద్ధరాంపురంలో మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు ఇలా రోడ్లపైనే నిల్వ ఉంటోంది. కొన్ని చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. ఇక వర్షం పడితే వీధులు మొత్తం మురుగే. ఇలా నెలల తరబడి మురుగు నిల్వ ఉండటంతో ఆ గ్రామస్థులు తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. దోమలూ అధికమయ్యాయి. ఏదైనా వాహనం వెళ్లినప్పుడు.. మురుగునీరు ఇళ్లల్లో చిట్లుతోంది. ఆ మురుగు వల్ల పాచిపట్టడంతో బైక్‌దారి జారి పడి.. గాయపడుతున్నారు. పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.