పాఠశాలలో బోరు ఏర్పాటు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:59 AM
స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో చాలా నెలలుగా తాగడానికి నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డీ.హీరేహాళ్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో చాలా నెలలుగా తాగడానికి నీరు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వెంటనే కొత్త బోరు ఏర్పాటు చేయాలని నాయకులు, అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం మార్కెట్ యార్డ్ ఛైర్మన హనుమంతరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన డైరెక్టర్ నాగళ్లి రాజు, మండల కన్వీనర్ మోహనరెడ్డి ఆ పాఠశాలలో బోర్ వేయించారు. అక్కడ పుష్కలంగా నీరు పడ్డాయి. బోరు మోటారు, విద్యుతను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఆ నాయకులు తెలిపారు.